నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో తమ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సత్తా చాటారని కృష్ణవేణి కళాశాలల డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్.గిరీశ్వర్‌రెడ్డి ఓపెన్ కేటగిరీలో 100వ ర్యాంకు సాధించగా, జేఎల్‌ఎస్.మైత్రేయి 683, సామియా సమర్ 3,661, జె.వినీత 5,187, ఎన్.కరుణశ్రీ 5,366, జి.ప్రహర్ష 5,459, బి.జ్యోత్స్న 6,359, కె.రేణుక 6,684, కె.కపిల్‌సాయి 8,065, ఎస్‌కే.ముబీన్ 8,268, కె.అక్షర 8,486, జి.ప్రవళిక 9,634వ ర్యాంకులు సాధించారన్నారు. వీరిని డైరెక్టర్లతో పాటు అకడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్‌కుమార్ అభినందించారు.


