ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్యాయత్నం

Aug 2 2026 12:58 AM | Updated on Aug 2 2026 12:58 AM

ముదిగొండ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసినా ఫలితం లేకపోగా, ఇంకొన్ని నోటిఫికేషన్లు రావడం లేదని చెబుతూ ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ‘గవర్నమెంట్‌కు సూసైడ్‌ నోట్‌’అంటూ లేఖ రాసిన ఆయన దీన్ని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాహుల్‌గాంధీకి చేరేవరకు షేర్‌ చేయాలని కోరాడు. ముదిగొండ మండ లం న్యూలక్ష్మీపురానికి చెందిన యువకుడు గడ్డం వేణుకుమార్‌ సువర్ణా పురం–ముత్తారం సమీపాన మిషన్‌ భగీరథ ల్యాబ్‌లో కాంట్రాక్ట్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కలేదని సమాచారం. ఈ మేరకు శనివారం సాయంత్రం విధుల నుంచి ఇంటికి వచ్చే సమయాన మానసిక దివ్యాంగురాలైన తన తల్లి వాడే మాత్రలు, ఎలుకల పేస్టు మింగాడు. ఆపై లేఖను తన స్నేహితుడికి పోస్ట్‌ చేశాడు. దీంతో ఆయన వేణు తండ్రికి సమాచారం ఇవ్వ గా ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ విషయమై ముది గొండ పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు ఆరా తీయగా.. న్యాయమూర్తి సైతం స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. కాగా, వేణు రాసిన లేఖలో ‘గతంలో గ్రూప్స్‌ రాసినా ఫలితం దక్కలేదు. మళ్లీ నోటిఫికేషన్‌ కోసం చూస్తుంటే ఆలస్యం జరుగుతోంది. ప్రభుత్వ నోటిఫికేషన్లు సకాలంలో వెలువడక ఆర్థికంగా, వయస్సు పరంగా నష్టపోయా. చిన్న నాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యమైనా ఉద్యోగం రాక గ్రూప్‌ నోటిఫికేషన్లు వెలువడక జీవితంపై విరక్తి చెందా. మరోపక్క తల్లి, అక్క ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులు తీవ్ర నిరాశకు గురిచేశాయి. నా పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్ఫథంతో పరిశీలించాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించి నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. నాలాంటి నిరుద్యోగులు ఇలాంటి పరిస్థితికి చేరకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.

సూసైడ్‌ నోట్‌ను సీఎం,

డిప్యూటీ సీఎంకు చేర్చాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement