బోనకల్: కేజీబీవీల్లో ఉపాధ్యాయులు, ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు పంపిస్తున్నట్లు టీఎస్ యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ మేరకు బోనకల్ కేజీబీవీలో పోస్టుకార్డులు పంపించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రా రంభించిన ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల శ్రమను దోచుకోవడం ఇకనైనా ఆపేసి మినిమం టైం స్కేల్ అమలుచేస్తూ పోస్టులకు తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాక సెలవులు వర్తింపజేయాలని, ఉపా ధ్యాయులను బోధనకే పరిమితం చేసి ఆరోగ్య కార్డుల జారీ, వార్షిక ఇంక్రిమెంట్లు, పెండింగ్ బిల్లుల విడుదలపై దృష్టి సారించాలని కోరా రు. కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిన్న రంగారావు, నాయకులు కె.లక్ష్మణ్‌రావు, సురేశ్, శశికళ, సక్కుబాయి, రాణి, మరియమ్మ, చంద్రకళ, నిర్మల, శైలజ, విజయకుమారి, ఝాన్సీ, సుధారాణి, సుజాత, సునీత పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమి
రక్షణకు ట్రెంచ్
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని గాడిదలవాగు సమీపంలోని 13 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సర్వే నంబర్ 13లో ఇతరులు సాగుచేస్తున్న భూమికి సర్వేయర్ నాగు ఆధ్వ ర్యాన సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. ప్రస్తు తం ఈ భూమిలోకి ఇతరులు వెళ్లకుండా శుక్రవారం ట్రెంచ్ కొట్టించారు. ఆర్‌ఐ ఉమామహేశ్వరరావు, జీపీఓ నాగేశ్వరరావు పనులను పర్యవేక్షించారు.
దుబాయ్‌లో ఉద్యోగాలకు 21న ఇంటర్వ్యూలు
ఖమ్మంరాపర్తినగర్: దుబాయిలోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉండడంతో అర్హుల ఎంపికకు టామ్‌కామ్ ఆధ్వర్యాన ఈ నెల 21న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి తెలిపారు. క్లీనర్లు, షట్టరింగ్ కార్పెంటర్, ప్లంబర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ తదితర ట్రేడ్లలో 500 మందిని ఎంపిక చేస్తారని చెప్పా రు. ఎంపికై న వారికి నైపుణ్యాల ఆధారంగా వేతనం అందుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు బయోడేటా, పాస్‌పోర్ట్, విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాలతో హైదరాబాద్‌లోని మాస బ్ ట్యాంక్ సమీపాన టామ్‌కామ్ కార్యాలయంలో ఈ నెల 21న జరిగే ఇంటర్వ్యూలకు హాజ రు కావాలని ఆమె ఓ ప్రకటనలో సూచించారు.
తెలంగాణ వాసులకే ప్రాధాన్యత ఇవ్వాలి
ఖమ్మంలీగల్: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఈ రాష్ట్రానికే చెందిన అర్హత, ప్రతి భ కలిగిన న్యాయవాదులు, న్యాయాధికారులకు ప్రాధాన్యత ఇవ్వాలని పలు అసోసియేషన్ల బాధ్యులు కోరారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ అడ్వకేట్ల అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ, ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ అధ్యక్షుడు తాళ్లూరి దిలీప్‌చౌదరి, ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ కార్యదర్శి మర్రి ప్రకాశ్‌రావు శుక్రవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయ మూర్తులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని, జూనియర్ అడ్వకేట్ల స్టైఫండ్‌ను రూ.వేయి నుంచి రూ. 12 వేలకు పెంచాలని కోరారు. అలాగే, శిక్షణ గడువు పొడిగింపు, ఆరోగ్య బీమా, పెన్షన్ అమలుపై వినతిపత్రం అందజేశారు.


