
ముదిగొండ : మాట్లాడుతున్న ఎంపీ నామా, పక్కన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు తదితరులు
● లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం ● ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ముదిగొండ/వేంసూరు: బీజేపీ నాయకుల బెదిరింపులకు తాము భయపడేది లేదని, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బాటలో ముందుకు సాగుతామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ముదిగొండ, వేంసూరు మండలం మర్లపాడులో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో ఆయన ఖమ్మం బీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. బలమైన నాయకుడు నామా పార్లమెంట్‌లో ఉంటే నిధులు సాధించడంతో పాటు సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈమేరకు పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలు, ప్రజల వాణిని బలంగా వినిపించగలిగే బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును మరోమారు గెలిపించాలని కోరారు. గత పదేళ్లలో ఏ ఒక్క రైతు సాగునీటికి ఇబ్బంది పడకపోగా.. ఇప్పు డు కాంగ్రెస్ తీరుతో పంటలు కోల్పోయారని తెలిపా రు. ఎంపీ అభ్యర్థి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం–సూర్యాపేట, కోదాడ–కురవి జాతీయ రహదారులపై రైతుల సౌకర్యార్థం అండర్ పాస్‌లతో పాటు సర్వీసు రోడ్లు మంజూరు చేయించానని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రజలు మరోమారు తనను గెలి పిస్తే జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతానని, కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటానని చెప్పారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ వెంకటవీరయ్య మాట్లాడుతూ అలవి గాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. ఏ హామీ సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆరోపించారు. వచ్చేనెల 13వ తేదీ తర్వాత జిల్లాలో అసలైన రాజకీయం మెదలవుతుందని తెలిపారు. ఈసమావేశాల్లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ, తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జెడ్పీ చైర్మన్ కమల్‌రాజు, ఎంపీపీలు ఎంపీపీ సామినేని హరిప్రసాద్, పగుట్ల వెంకటేశ్వరరావుతో పాటు గొర్ల సంజీవరెడ్డి, దొడ్డ వెంకటకృష్ణారెడ్డి, మందపాటి మహేశ్వరరెడ్డి, నూనె హరిబాబు, గొర్ల రాంమోహన్‌రెడ్డి, పాలా వెంకటరెడ్డి, గొర్ల ప్రభకర్‌రెడ్డి, పుచ్చకాయల శంకర్‌రెడ్డి, జుబ్బురు నాగరాజు, నల్లమోతు ప్రసాద్, కె.సుధాకర్, గొర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.