కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
● చైనా మాంజా విక్రయాలు,
వినియోగం నేరమే
ఖమ్మంక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు నిర్వహించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషన ర్ సునీల్‌దత్ హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో పందేలు, పేకాట స్థావరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాల ని అధికారులను ఆదేశించారు. అలాగే, పక్షులతో పాటు ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజా విక్రయించినా, వినియోగించి నా కఠినంగా వ్యవహరిస్తామని సీపీ తెలిపారు. సింథటిక్ దారం, గాజు పొడితో చేసే ఈ మాంజాతో పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడమే కాక మనుషులకు గాయాలయవుతాయని వెల్లడించారు. దీని విక్రయం, వినియోగం వివరాలు తెలిస్తే ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు.
ఈసీఆర్ విద్యార్థులకు వరం
ఖమ్మం సహకారనగర్: ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వరంలా నిలుస్తోందని డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఖమ్మం అర్బన్ ఎమ్మార్సీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండో విడతగా 30 రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం తొలిదశతో విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం గణనీయంగా పెరిగినందున రెండో విడతపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాగా, వచ్చేనెలలో జరగనున్న ఎఫ్‌ఎల్‌ఎస్ సర్వేలో జిల్లా అగ్రస్థానాన నిలిచేలా కృషి చేయాలని ఆమె తెలిపారు. సూచించారు. ఈ సమావేశంలో సీఎంఓ ప్రవీణ్‌కుమార్, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజ లక్ష్మీ, హెచ్‌ఎంలు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.
పేరు పెట్టండి..
బహుమతి పట్టండి!
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్‌కు కొత్త పేరు, ట్యాగ్‌లైన్ కోసం ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి పోటీల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. పార్క్‌కు కొత్త పేరు, ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌తో పాటు లోగో రూపకల్పన కోసం పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10నుంచి 20వ తేదీ వరకు ఆసక్తి ఉన్న వారు సూచనలు పంపించాలని వెల్లడించారు. ఉత్తమ పేరు, ట్యాగ్‌లైన్‌కు రూ.4 వేల నగదు బహుమతి, ఉత్తమ లోగోకు రూ.4వేల బహుమతి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎఫ్‌డీఓ మంజుల, జలవనరులశాఖ ఈఈ వెంకట్రామ్, డీఏఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
ఖమ్మంలీగల్: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కల్ప న సూచించారు. ఈనెల 9వ తేదీ వరకు జరగనున్న రహదారి భద్రతా కార్యాచరణ పోస్టర్లను మంగళవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్లు, కార్లు నడిపే వారు సీట్‌బెల్ట్ తప్పక ధరించడంతో పాటు పరిమిత వేగంతో నడిపితే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. అంతేకాక ప్రయాణ సమయంలో అవసరమైన అన్ని పత్రాలను వెంట తీసుకెళ్తే తనిఖీల సమయాన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీఓ జగదీష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు


