గ్యారంటీలు ఏవీ?
ట్రైలర్‌తో భయపడ్డారు..
మంత్రులు, కాంగ్రెస్ నేతలకు
సినిమా అర్థమైంది
మా హయాంలోనే సీతమ్మసాగర్
90 శాతం పూర్తి
సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షిప్రతినిది, ఖమ్మం: ‘ఎన్నికల సమయంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్న మల్లు భట్టివిక్రమార్క గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి. వంద రోజుల తర్వాత మా ప్రభుత్వం రాగానే అందులోని హామీలన్నీ నెరవేరుస్తాం అన్నారు. రెండేళ్లు గడిచినా ఆ 420 హామీలు ఏమయ్యాయి?’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ మద్దతుతో జిల్లాలో గెలిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం బుధవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించగా కేటీఆర్ మాట్లాడారు.
రూపురేఖలు మార్చింది కేసీఆరే..
ఖమ్మంలో రహదారుల విస్తరణ, డివైడర్లు, జంక్షన్ల నిర్మాణం బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందని కేటీఆర్ తెలిపారు. లకారం చెరువు అభివృద్ధి, కొత్త బస్టాండ్, కేఎంసీ భవనం, ఐటీ హబ్ నిర్మాణాలు కేసీఆర్ ఘనతేనని చెప్పారు. కానీ తుమ్మల హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెబుతున్నా... 2014లో ఆయన ఓడిపోతే మిత్రుడు కదా అని కేసీఆర్ తీసుకొచ్చి మంత్రిని చేశాడని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పూర్తయ్యేదని తెలిపారు.
కేసీఆరే అభ్యర్థిగా భావించండి..
త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను కేసీఆర్‌గా భావించి ఓట్లు వేయాలని కోరారు. జిల్లా ప్రజలు ‘పోతే గీతే మా ఎమ్మెల్యే పోతడు, కేసీఆర్ అయితే ఉంటారు కదా’ అని అనుకోవడంతోనే సీట్లు పోయాయని తెలిపారు. ఈసారి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 7 – 8 అసెంబ్లీ స్థానాలు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ల ఇళ్లు తిరుగుతున్న మంత్రి..
ఖమ్మంలో మంత్రి బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మంకు తాను వస్తున్నట్లు తెలిసి ముగ్గురు కార్పొరేటర్లను సీఎం దగ్గర కూర్చోబెట్టాడని తెలిపారు. అయితే, ఎందరిని ఎత్తుకెళ్లినా ప్రజల మద్దతు తమకు ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా 127 మంది సర్పంచ్‌లు, 156 మంది ఉపసర్పంచ్‌లు ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉంది..
ఖమ్మం వస్తుంటే నాయకన్ గూడెం వద్ద స్వాగతం పలికిన వారిలో రైతులు యూరియా బస్తా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగితే ‘పాలిచ్చే గేదెను వద్దనుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నాము’ అని వాపోయారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనిపిస్తోందని తెలిపారు. సుమారు 7.5 లక్షల ఎకరాల కొత్త, పాత ఆయకట్టుకు సాగునీరు అందించేలా కేసీఆర్ డిజైన్ చేసిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు బీఆర్‌ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి ప్రాజెక్టు గొప్పతనాన్ని చెప్పకుండా కాల్వలు తవ్వలేదని మాట్లాడారని పేర్కొన్నారు. ఇల్లెందు లాంటి ప్రాంతాలకు నీళ్లు వెళ్లకుండా వారే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, బానోతు చంద్రావతి, నాగేశ్వరరావు, హరి ప్రియ, వెంకటేశ్వర్లు, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు కమల్‌రాజు, కూరా కుల నాగభూషణం, నాయకులు దిండిగాల రాజేందర్, గుండాల కృష్ణ, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రూట్ సర్వేలో పాల్గొన్న ఆర్‌ఎం సరిరామ్,
డిపో మేనేజర్లు
డిప్యూటీ సీఎంతో పాటు ఇక్కడి ఇద్దరు మంత్రులు పంచాయతీ ఎన్నికల ట్రైలర్‌తో భయపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. గెలిచిన సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరితేనే పథకాలు, నిధులు ఇస్తామని మభ్యపెడితే భయపడొద్దని సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
గ్యారంటీలు ఏవీ?


