ఉత్సాహంగా సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్/మధిర/ఎర్రుపాలెం/బోనకల్/ చింతకాని/నేలకొండపల్లి: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యాన గురువారం జిల్లాలోని పలు మండలాల్లో క్రీడాజ్యోతి ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ ర్యాలీని ఖమ్మంలో డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో సీఎం కప్ క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు ప్రతిభను మెరుగు పరుచుకునేందుకు ఈ పోటీలు వేదికగా నిలవనుండగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ నేలకొండపల్లి, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో కొనసాగగా, అధికారులు, క్రీడాకారులు స్వాగతం పలికి పాల్గొన్నారు. కాగా, పలు మండలాల్లో ర్యాలీ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు, కోచ్‌లు ఎం.డీ.గౌస్, కోచ్‌లు వీవీఎస్ మూర్తి, పరిపూర్ణాచారి, సురేష్, చంద్రకాంత్, నాగరాజు, భవ్య, నోయోల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పీఈటీలు వి.వెంకటేశ్వర్లు, ఎం.యర్రయ్య, బి.చలపతిరావు, వెంకటలక్ష్మి, కిలారు మనోహర్‌బాబు, బాబ్జీప్రసాద్, సలాది రామారావు, వీరేందర్, రమాదేవి, పుల్లయ్య, పొదిలి వెంకన్న, సయ్యద్ నవీద్‌పాషా, నారాయణ, కనకరాజు, బి.సురేందర్, బి.మురళీమోహన్‌రావు, రమేష్, సంపత్‌కుమార్, రమేష్, ఆర్.రాంబాబు, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, చిన్ని, ప్రవీణ్ కుమార్, చైతన్య, వేణు, సునీల్, నరసింహారావు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.


