అభ్యంతరాలు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగా జిల్లానుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కుముదిని మాట్లాడుతూ ఈనెల 12న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా విడుదల చేసి, 13వ తేదీన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రటించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితాలపై 192 అభ్యంతరాలు అందగా, 129 పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, డీపీఓ రాంబాబు, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, సంపత్, నర్సింహ, రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


