
స్ట్రాంగ్ రూంలో పరిశీలిస్తున్న సీపీ వారియర్
మధిర: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మధిర మండలం ఖాజీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనంలో ఈవీఎంలను భద్రపరిచా రు. ఈమేరకు స్ట్రాంగ్‌రూమ్ వద్ద భద్రతను పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ బుధవా రం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటచేయడంతో పాటు సిబ్బంది 24గంటల పాటుట అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏసీపీ రవి, మధిర సీఐ జా టోత్ వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.