అలా వెళ్లి.. కుడి వైపు తిరగండి! | Sakshi
Sakshi News home page

అలా వెళ్లి.. కుడి వైపు తిరగండి!

Published Mon, Jun 5 2023 8:04 AM

- - Sakshi

ఖమ్మం: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ఏ విభాగం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఇబ్బంది పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఏ అంతస్తులో ఏ శాఖ ఉంది, ఎలా వెళ్లాలనేది బోర్డుల్లో పేర్కొన్నారు.

కింది అంతస్తుల్లో ప్రతీ అంతస్తులోని విభాగాల వివరాలతో బోర్డు ఏర్పాటుచేయగా.. అన్ని అంతస్తుల్లో అక్కడి విభాగాల వివరాలు పొందుపర్చిన బోర్డులు ఏర్పాటుచేశారు. అలాగే, కలెక్టరేట్‌ రాగానే సమావేశ మందిరానికి వెళ్లే వైపు ఇన్‌వార్డు, ధరణి విచారణ కేంద్రానికి బోర్డులు పెట్టారు. ఇక ప్రభుత్వ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ఫొటోలను టీవీల్లో ప్రదర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement