ఉచిత ప్రయాణం..! మహిళల ఇష్టారాజ్యం..!! | Woman Over Action In Karnataka RTC Bus | Sakshi
Sakshi News home page

ఉచిత ప్రయాణం..! మహిళల ఇష్టారాజ్యం..!!

Jul 17 2023 8:01 AM | Updated on Jul 17 2023 8:25 AM

Woman Over Action In Karnataka RTC Bus - Sakshi

యశవంతపుర: ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్‌తో గొడవ పడడంతో డ్రైవర్‌ బస్‌ను నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూర పట్టణంలో జరిగింది. శనివారం సాయంత్రం చిక్కోడి నుంచి గోకాక్‌కు ఆర్టీసీ బస్‌ బయలుదేరింది. బస్‌ను ఆరోగ్య కేంద్రం వద్ద నిలపాలని కొందరు మహిళలు డిమాండ్‌ చేశారు.

అక్కడ స్టాప్‌ లేదని డ్రైవర్‌ చెప్పాడు. ఎందుకు నిలపవంటూ ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్‌తో గలాటాకు దిగారు. దీంతో డ్రైవర్‌ కబ్బూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి వచ్చాక గొడవలు పెరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి

Advertisement
 
Advertisement
Advertisement