సహకారమే విజయానికి సోపానం | - | Sakshi
Sakshi News home page

సహకారమే విజయానికి సోపానం

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

బళ్లారి అర్బన్‌: సహకార సంఘాల సహకారం, భాగస్వామ్యంతోనే సహకార ఉద్యమం విజయవంతంగా ముందుకు సాగుతోందని బళ్లారి సెంట్రల్‌ కో–ఆపరేటివ్‌ హోల్‌సేల్‌ అసోసియేషన్‌ (జనతా బజార్‌) అధ్యక్షురాలు పల్లడ మైత్రి అన్నారు. ఆదివారం నగరంలోని రాఘవ కళామందిరంలో జనతా బజార్‌ 71వ వార్షికోత్సవం సందర్భంగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనతా బజార్‌లో జరిగి వ్యాపార, లావాదేవీలను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో డైరెక్టర్లు, సిబ్బంది సభ్యుల సహకారం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో జనతా బజార్‌ను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నీలకంఠప్ప, పి.దానారెడ్డి, వీరశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement