సాక్షి, బళ్లారి: 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పరిపాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ఎస్‌సీసీ మైదానంలో మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఓటరు జాబితాలో చేర్పించిన వారి పేర్లు లేకపోతే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. ప్రజా ప్రభుత్వ వ్యవస్థలో ఓటు అనే ఆయుధం ఎంతో కీలకం అన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మారథాన్ నగర వాసులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు.


