బందోబస్తు చేపట్టిన పోలీసులు
అభ్యర్థుల హాల్‌టికెట్లను తనిఖీ చేసి పంపుతున్న దృశ్యం
సాక్షి, బళ్లారి: కర్ణాటక పరీక్ష ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ (కేఎస్‌ఆర్‌పీ), కేఎస్‌ఐఎస్‌ఎఫ్, ఐఆర్‌బీ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. బళ్లారి నగర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరిగింది. 23 పరీక్ష కేంద్రాల్లో 14,059 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా, మంచినీటి సదుపాయం కల్పించారు. ఎస్పీ సుమన్ పన్నేకర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి, అవాఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.


