మమ్మేలు స్వామీ.. మహా గణపతి | - | Sakshi
Sakshi News home page

మమ్మేలు స్వామీ.. మహా గణపతి

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

సాక్షి,బళ్లారి: వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలోని వివిధ వివిధ కాలనీలు, రోడ్లలో ఏర్పాటు చేసిన దాదాపు వెయ్యికి పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. కొన్ని కాలనీల్లో మూడు రోజుల పాటు పూజలు చేసి వినాయక నిమజ్జనం చేయగా, మరికొన్ని కాలనీల వాసులు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి శుక్రవారం రాత్రి పొద్దుపోయాక నిమజ్జనం చేశారు. రాత్రంగా నగర పురవీధుల గుండా వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగింపు చేపట్టారు. డీజేలు పెట్టుకుని భక్తి, సినిమాలకు సంబంధించిన పాటలకు నృత్యాలు, డ్యాన్స్‌లు చేస్తూ హోరెత్తించారు. ట్రాక్టర్లు, ఆటోలకు ఘనంగా విద్యుత్‌ దీపాలంకరణలు చేసుకుని, అందులో వినాయకులను కూర్చోబెట్టి ఊరేగించి నగర శివార్లలోని తుంగభద్ర కాలువల్లోకి నిమజ్జనం చేశారు. ఆయా కాలనీల వాసులు పెద్ద సంఖ్యలో జనం చేరి వినాయక విగ్రహాల ఊరేగింపును తిలకించారు. అనంతపురం రోడ్డులోని సెంటినరీ హాల్‌లో ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతి మినహా దాదాపు అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. జిల్లా ఎస్పీ సుమన్‌ పన్నేకర్‌ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

వినూత్న గణేష్‌ విగ్రహాన్ని దర్శించిన ‘గాలి’

నగరంలోని దేవినగర్‌లో వినూత్న తరహాలో ఏర్పాటు చేసిన నరసింహస్వామి ఎత్తుకున్న గణేష్‌ విగ్రహం నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గత ఐదు రోజుల నుంచి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈనేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి కూడా శనివారం ఆ విగ్రహాన్ని దర్శించుకున్నారు. భీమలింగ, సోమశేఖర్‌, బాషా తదితరులు పాల్గొన్నారు.

విజయనగరలో...

హొసపేటె: భారీ పోలీసు భద్రత నడుమ విజయనగర జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి జరిగిన గణేష్‌ నిమజ్జన కార్యక్రమం 5వ రోజు చిన్నపాటి సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రమైన హొసపేటె నగరంతో సహా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మొత్తం 674 గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగర పరిధిలో ప్రతిష్టించిన 124 గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు గణేశ్‌ విగ్రహాలను నగరంలోని ప్రధాన రహదారుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. కొన్ని గణేశ్‌ విగ్రహాలను నగర ప్రధాన రహదారి గుండా రైల్వే స్టేషన్‌ రోడ్డులోని పవర్‌ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. నగరంలోని చిత్తవాడిగి, సండూరు రోడ్‌, జంబునాథ రోడ్‌, బళ్లారి రోడ్‌, హరిహర రోడ్లలో ఉన్న హెచ్‌ఎల్‌సీలో నిమజ్జనం చేశారు.

ఎమ్మెల్యే గవియప్ప పూజలు

5వ రోజు గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌.గవియప్ప శుక్రవారం రాత్రి ప్రధాన మసీదును సందర్శించి గణేష్‌ విగ్రహానికి హారతినిచ్చారు. మహిళలు, యువతీయువకులు, వృద్ధులు గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో చేరి డీజే సంగీతానికి అనుగుణంగా చిందులు వేశారు. ఊరేగింపు జరుగుతున్న ప్రధాన రహదారిపై ఉన్న మసీదు సమీపంలో ఊరేగింపును వీక్షించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

జైజై గణేశా.. బైబై గణేశా

హోరెత్తిన ఊరేగింపు సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement