గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

రాయచూరు రూరల్‌: నగరంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఎస్పీ తన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. అల్లమప్రభు కాలనీలో 1,810 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎల్‌బీఎ్‌స్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ కై ఫ్‌(20), హుసేన్‌ బాషా(23) అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశామన్నారు.

ఎమ్మెల్యేలు భూమిపూజకే పరిమితమా?

రాయచూరు రూరల్‌: జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ్యులు భూమిపూజకే పరిమితమా? అని రాయచూరు రూరల్‌ మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్‌ ఆరోపించారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా లేక, కరువు సహాయక పనులు చేపట్టక పోవడాన్ని ఖండించారు. కరువు నెలకొన్నందున రైతులకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందించాలని, రైతులకు 12 గంటల పాటు విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ కింద ఉపకాలువలకు నేటికీ నీటి విడుదలలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. వీటన్నింటిని పక్కన పెట్టి భూమిపూజల పేరుతో నిధులు లేకున్నా పథకాలకు శ్రీకారం చుట్టడం భావ్యం కాదన్నారు. విలేకరుల సమావేఽశంలో నిత్యానందరెడ్డి, కేశవరెడ్డి, అచ్చుతరెడ్డి, సిద్దనగౌడ, బండేష్‌, జగదీశ్‌లున్నారు.

రైతు స్నేహిగా సమాఖ్య

కోలారు: ఎన్నో ఆటంకాలను అధిగమించి అరాభి కొత్తనూరు ప్రాథమిక వివిధోద్దేశ వ్యవసాయ గ్రామీణ సహకార సమాఖ్య మొదటి సంవత్సరంలోనే రూ.12 లక్షల రుణాలు అందించి రైతు స్నేహిగా సాగుతోందని కోలారు పాల ఉత్పత్తిదారుల సమాఖ్య డైరెక్టర్‌ డీ.నాగరాజప్ప చెప్పారు. అరాభికొత్తనూరు గ్రామంలోని సోమేశ్వర కల్యాణ మంటపంలో నిర్వహించిన సంఘం ప్రథమ సర్వ సభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దింబ నాగరాజప్ప, దేవిక, తిమ్మయ్య, ఎం నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement