29న అభివృద్ధి పథకాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

29న అభివృద్ధి పథకాల ప్రారంభం

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

హొసపేటె: నగర, పరిసర ప్రాంతాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, అలాగే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పూర్తయిన పథకాలన్నింటినీ ఈనెల 29న ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌.గవియప్ప తెలిపారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో చేపట్టిన వివిధ శాఖల పురోగతిపై సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి, దేవదాయ, మత్స్య, ఓడరేవులు, అంతర్గత జల రవాణా శాఖ మంత్రి కేఎస్‌ బసవంతప్ప ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

పూర్తయిన అభివృద్ధి పథకాలివే..

నగరంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ సమీపంలో పర్యాటక శాఖ అందించిన రూ.5 కోట్ల గ్రాంటుతో వ్యవసాయ పర్యాటక గృహం, విద్యా శాఖ అతిథిగృహం, డీఎంఎఫ్‌ గ్రాంట్‌ కింద రూ.2 కోట్లతో హంపీ కన్నడ వర్సిటీ ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.12 కోట్ల వ్యయంతో కూరగాయల మార్కెట్‌ ప్రాజెక్ట్‌ కూడా పూర్తయింది.

రూ.10 కోట్లతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం

మహదేవపుర, కగ్గదాసపురల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక గ్రాంటు కింద రూ.9 కోట్ల వ్యయంతో కబేళా నిర్మాణం పూర్తయింది. రూ.12 కోట్ల వ్యయంతో తాగునీటి సరఫరా వ్యవస్థ పునరుద్ధరణ, ఉన్నతీకరణ ప్రాజెక్టు కింద యూఎస్‌ఐక్యూఏ, నీటి శుద్ధి యూనిట్‌తో సహా ప్రస్తుత వ్యవస్థను ఉన్నతీకరించే పనులు చేపట్టారు. రూ.65 లక్షల వ్యయంతో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ నిల్వ గది, జిల్లా ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు కింద మహదేవపుర సమీపంలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో పోస్ట్‌–మెట్రిక్యులేషన్‌ బాలికల హాస్టల్‌ను నిర్మించారన్నారు. ఈ సందర్భంగా జిల్లాధికారిణి కవిత ఎస్‌.మన్నికేరి, అదనపు డిప్యూటీ కమిషనర్‌ పీఎన్‌ లోకేష్‌ తదితరులు హాజరయ్యారు.

ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌.గవియప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement