హుబ్లీ: నగరంలోని గబ్బూరు వద్ద జాతీయ రహదారిలో రూ.700 కోట్లతో నిర్మించిన కేఎల్‌ఈ సంస్థ జగద్గురు గంగాధర స్వామి మూరుసావిర మఠం వైద్య కళాశాల, పరిశోధన కేంద్రం ఆస్పత్రిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ స్వామీజీ శనివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేఎల్‌ఈ సంస్థ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రభాకర్ కోరే మాట్లాడుతూ మూరుసావిర మఠం ఆధ్వర్యంలో కేటాయించిన 23 ఎకరాల స్థలంలో వైద్య కళాశాల ఆస్పత్రి పరిశోధన కేంద్ర నిర్మించాం. మఠం పేరున సంస్థకు నామకరణం చేశాం. కేఎల్‌ఈ సంస్థ సమాజ సేవలో 110 ఏళ్ల పరంపరను కొనసాగిస్తోందని తెలిపారు.


