ఉత్తర కన్నడ జిల్లా నుంచి.. | - | Sakshi
Sakshi News home page

ఉత్తర కన్నడ జిల్లా నుంచి..

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

అనంత్‌నాగ్‌ 1948 సెప్టెంబరు 4వ తేదీన ఉత్తర కన్నడ జిల్లా భట్కళ వద్ద శిరాళిలో ఆనంది, సదానంద నాగరకట్టె దంపతులకు జన్మించారు. ఆయన తమ్ముడు శంకర్‌ నాగ్‌, ప్రముఖ నటుడు అన్నది తెలిసిందే. అనంత్‌నాగ్‌ మంగళూరు, మైసూరు, ముంబైలో చదువుకున్నారు. ఆర్మీలో చేరడానికి వెళ్తే తగిన బరువు లేవని తిరస్కరించారు. అప్పటి నుంచి నటన, నాటకాలపై శ్రద్ధ పెట్టారు. కన్నడలో 250 సినిమాలు, తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో 50 సినిమాలలో నటించారు. ఇటీవల కేజీఎఫ్‌ సినిమాలో జర్నలిస్టు పాత్ర చాలా పాపులర్‌ అయ్యింది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై , జేహెచ్‌ పటేల్‌ సర్కారులో నగరాభివృద్ధి మంత్రిగా కూడా సేవలందించారు. ఆయనకు భార్య గాయత్రి, కుమార్తె అదితి నాగ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement