6వేలు కాదు.. 3వేలే ఇవ్వగలం | - | Sakshi
Sakshi News home page

6వేలు కాదు.. 3వేలే ఇవ్వగలం

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

తలకావేరిలో తీర్థోద్భవం (ఫైల్‌)

రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలియజేస్తున్న రైతులు

శివాజీనగర: తమిళనాడుకు రోజూ 6 వేల క్యూసెక్కులకు బదులుగా 3 వేల క్యూసెక్కులను విడుదల చేసేలా ఉత్తర్వును సవరించాలని కావేరీ జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ)ను కర్ణాటక సర్కారు కోరింది. 15వ తేదీ నాటికి, కర్ణాటకలోని నాలుగు కావేరి ప్రధాన జలాశయాలలో మొత్తం 55 టీఎంసీల నిల్వ ఉంది. ఇది మొత్తం గరిష్ట నిల్వ సామర్థ్యంలో కేవలం 52.97 శాతం మాత్రమే అని తెలిపింది. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు ఈ డ్యాముల్లోకి చేరిన నీరు 111 టీఎంసీలు. గత 30 ఏళ్లలో ఇదే కాలానికి సగటున నీటి ప్రవాహం 228 టీఎంసీలుగా ఉండేదని తెలిపింది. ఈసారి 51 శాతం కంటే ఎక్కువ లోటు అని పేర్కొంది. ఇన్‌ఫ్లో తగ్గడం వల్ల అదనపు నీటిని విడుదల చేయడం సాధ్యపడదని సమాచారం.

రైతుల నిరసన

మండ్య: రాష్ట్రంలో తీవ్ర కరువు మధ్య కూడా రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి తమిళనాడుకు నిరంతరం కావేరి నీటిని వదులుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని రాష్ట్ర రైతు సంఘం కార్యకర్తలు బుధవారం మండ్య నగరంలో ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రైతు సంఘం జిల్లా నాయకుడు శివళ్లి చంద్రశేఖర్‌ నేతృత్వంలో నగరంలోని జేసీ సర్కిల్‌లో ధర్నా చేశారు.

అక్టోబరు 17న కావేరి తీర్థోద్భవం

దొడ్డబళ్లాపురం: జీవనది కావేరి జన్మస్థానం కొడగు జిల్లా మడికెరి వద్ద తలకావేరిలో సంవత్సరానికి ఒకసారి జరిగే పవిత్ర కావేరి తీర్థోద్భవం ముహూర్తం ఖరారైంది. అక్టోబర్‌ 17న ఈ వేడుక జరుగుతుంది. ఆ రోజు రాత్రి 7 గంటల 50 నిమిషాలకు శుభ మేషలగ్నంలో తీర్థోద్భవం సాగుతుంది. కావేరి నది కుండంలో పవిత్ర పూజలు ఆచరిస్తారు. కర్ణాటక రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఆ రోజు కుండంలో ఉబికివచ్చే పవిత్ర జలాన్ని ఇళ్లకు తీసుకెళ్తారు.

కావేరి జలాల విడుదలపై

అథారిటీకి రాష్ట్రం వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement