మాజీ జవాను, కూతురు నరికివేత | - | Sakshi
Sakshi News home page

మాజీ జవాను, కూతురు నరికివేత

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

దొడ్డబళ్లాపురం: ఆస్తి కోసం అనుబంధాలు మృగ్యమయ్యాయి. తండ్రి, కుమార్తెను అతని సోదరులే నరికి చంపారు. బుధవారం మధ్యాహ్నం బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా అవరాది గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... అవరాదికి చెందిన రిటైర్డ్‌ జవాన్‌ రుద్రప్ప (67), ఆయన కుమార్తె శశికళ (26), కారులో డ్రైవరుతో వచ్చారు. రుద్రప్ప సహోదరులైన బసప్ప, సంగప్ప, సంగప్ప కుమారుడు మడివాళప్ప కొడవళ్లతో విరుచుకుపడ్డారు. ముందుగా రుద్రప్పపై దాడి చేయగా అడ్డువచ్చిన కుమార్తె శశికళపైను కూడా నరికి హత్య చేశారు. కారు డ్రైవరు రాహుల్‌ లోఖండే గాయాలతో బయటపడ్డాడు.

పంచాయతీ ఆఫీసు ముందే

రుద్రప్ప, సోదరుల మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ధార్వాడలో ఉన్న భూమిని పంచాలని రుద్రప్ప కోరగా వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుద్రప్ప కుమార్తెతో కలిసి తమ ఇంటి దాఖలాలు పరిష్కారం కోసం గ్రామ పంచాయతి కార్యాలయానికి వచ్చాడు. ఇది తెలుసుకున్న సోదరులు ఆఫీసు ముందే నరికి చంపడం సంచలనం కలిగిస్తోంది. కిత్తూరు పోలీసులు వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

దాయాదుల దాష్టీకం

బెళగావి జిల్లాలో కిరాతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement