బనశంకరి: కన్నడ చిత్రసీమకు అపురూపమైన గౌరవం దక్కింది. సీనియర్ విలక్షణ నటుడు అనంత్‌నాగ్‌కు కేంద్ర ప్రభుత్వం సినీరంగ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ప్రకటించింది. సుదీర్ఘ సినీ సేవలకు గుర్తుగా 2024 ఏడాదికిగాను అవార్డును ప్రకటించడంతో శాండల్‌వుడ్‌లో హర్షం వ్యక్తమవుతోంది. ఆ పురస్కారం పొందిన రెండవ కన్నడ నటునిగా అనంత్‌నాగ్ ఖ్యాతి ఘడించారు. గతంలో కన్నడ కంఠీరవ డా.రాజ్‌కుమార్‌కు 1995లో దాదాసాహెబ్ అవార్డు లభించింది. ఈనెల 22వ తేదీ గుజరాత్‌లోని కెవాడిలో నిర్వహించే 72 వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అనంత్‌నాగ్‌కు ప్రశస్తిని అందజేస్తారు. ప్రధాని నరేంద్రమోదీ సహా అనేకమంది నటీనటులు ఆయనను సోషల్ మీడియా ద్వారా అభినందించారు.
అనంత్‌నాగ్‌కు
దాదాసాహెబ్ పాల్కే పురస్కారం


