చింతామణి: పూలు కోయడానికి ఓమ్ని కారులో 13 మందిని మహిళా కూలీలతో వెళ్తుండగా మృత్యు శకటంలా టెంపో లారీ ఢీకొట్టింది. ముగ్గురు మహిళలు మరణించారు. శిడ్లఘట్ట తాలూకాలోని హొసహళ్లి గేట్ దగ్గర సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. చింతామణి తాలూకా మల్లిఖార్జునపుర గ్రామానికి చెందిన మహిళా కూలీలు శిడ్లఘట్ట తాలూకాలోని తోటలో కూలి పనికి ఓమ్నీలో బయల్దేరారు. ఘటనాస్థలిలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఓమ్నీ పల్టీలు కొట్టింది. రత్నమ్మ, (40), మునిచెన్నమ్మ (50), రూప (35) ప్రాణాలు కోల్పోయారు. మునిరత్నమ్మ, లక్ష్మీనరసమ్మ, నరసమ్మ, అనిత తీవ్రంగా గాయపడ్డారు. మంగమ్మ, నాగవేణి, లక్షమ్మ, రుక్మిణి, శిల్ప, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు తక్షణమే బాధితులను శిడ్లఘట్ట ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ పద్మిని సాహో ప్రమాదస్థలిని పరిశీలించారు.
ఓమ్నీని ఢీకొన్న మినీ లారీ.. ముగ్గురు మహిళా కూలీల మృతి


