హొసపేటె: గంగావతి తాలూకాలోని దాసనాళ సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర ఎడమ కాలువకు ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీఅరుణ సోమవారం రైతులు, బీజేపీ కార్యకర్తల సమక్షంలో వాయనం సమర్పించారు. శ్రావణమాసం సందర్భంగా మల్లాపుర సమీపంలోని వాన వీరభద్రేశ్వర ఆలయ మూడో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం వీరభద్రేశ్వర విగ్రహానికి రుద్రాభిషేకంతో పాటు వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడి దయతో మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని తాను ప్రార్థించానన్నారు. కల్మఠ కొట్టూరేశ్వర స్వామీజీ, జోగద నారాయణప్ప, శరబయ్య హిరేమట, మహంతేష్ శాస్త్రి హిరేమట, శ్రీకాంత్ హిరేమట, అనిల్, తుంగభద్ర సేవా సమితి సభ్యులు లింగరాజ్‌గౌడ, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.


