ఉద్యోగ ప్రాప్తిరస్తు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ ప్రాప్తిరస్తు

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

ఉచిత భోజన వసతి

హొసపేటె: హొసపేటె నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు కొందరు ఉచితంగా భోజన అందించి మానవత్వం చాటుకున్నారు. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా తమవంతు సాయంగా భోజనం పెట్టామని నిర్వాహకులు తెలిపారు. లక్ష్మి, షర్వి, శ్రీకాంత్‌, బసవరాజ్‌, కిరణ్‌ కుమార్‌, మంజు నాయక్‌, రేణుక నాయక్‌ పాల్గొన్నారు.

బళ్లారి అర్బన్‌: బళ్లారి నగరంలోని పలు పరీక్ష కేంద్రాల్లో సాయుధ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు ఆదివారం ప్రశాంతంగా పరీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ కళాశాల, మేధా కళాశాల, సన్‌జోన్స్‌ స్కూల్‌, గర్‌ల్స్‌, సరళా దేవి కళాశాల తదితర కేంద్రాలకు ఉదయమే అభ్యర్థులు చేరుకున్నారు. జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్‌, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షకు 10 వేలకు పైగా అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

పరీక్ష కేంద్రం వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు

హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు

హొసపేటె: కర్ణాటక సాయుధ పోలీస్‌ కానిస్టేబుల్‌ (సీఏఆర్‌/డీఏఆర్‌) నియామక రాత పరీక్ష ఆదివారం విజయవంతంగా జరిగింది. విజయనగర జిల్లాకు సంబంధించి హోస్పేట్‌లో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బారులు తీరారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్‌.జాహ్నవి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకం కోసం కర్ణాటక పరీక్షల అథారిటీ రాత పరీక్ష నిర్వహిస్తోందన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్ష పారదర్శకంగా జరిగిందన్నారు. ఉదయం సెషన్‌లో 4,406 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 4,500 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌, తాగునీరు, టాయిలెట్లతో సహా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రశ్నపత్రాలు ఉంచే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌, కాలిక్యులేటర్లతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకుని రాకుండా తనిఖీలు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేసినట్లు తెలిపారు.

ప్రశాంతంగా కేఎస్పీ సాయుధ

పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement