ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

రాయచూరు రూరల్‌: ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు ప్రజా సేవా అభియాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ పేర్కొన్నారు. ఆదివారం రాయచూరు తాలూకా యాపల దిన్ని ప్రభుత్వ హైస్కూలు మైదానంలో ప్రజా సేవా అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకే పాలన అందిస్తామని తెలిపారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీపీఈఓ చంద్రశేఖర్‌ పవార్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మంజునాథ్‌, ఆరోగ్య అధికారి యోగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement