హనుమకు శ్రావణ పూజలు | - | Sakshi
Sakshi News home page

హనుమకు శ్రావణ పూజలు

Sep 6 2026 12:55 AM | Updated on Sep 6 2026 12:55 AM

మైసూరు: శ్రావణ మాసంలోని నాలుగవ శనివారం సందర్భంగా, నగరంలోని ఇర్విన్‌ రోడ్డులో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామికి అభ్యంజన తైలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పాభిషేకాలు గావించారు. హోమం నిర్వర్తించారు. వందలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు.

మోదీ రూ.15 లక్షలు

ఇచ్చారా?: సిద్దు

శివాజీనగర: ‘సీఎం పదవికి రాజీనామా చేయవద్దు సార్‌ అని నాకు చాలా మంది నాకు చెప్పారు. కానీ మాట ఇచ్చానని’ సిద్దరామయ్య తెలిపారు. శనివారం చిక్కమగళూరు జిల్లా కడూరులో మాట్లాడుతూ, తాను ఏదైన గుడికి వెళ్లినప్పుడు మోదీ.. మోదీ..అని అంటుండేవారు. మోదీ స్వాతంత్య్రం కోసం పోరాడారా? 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? అచ్చేదిన్‌ ఎక్కడ, రైతుల ఆదాయం రెండింతలు చేస్తానన్నారు చేశారా? 12 సంవత్సరాలు అయింది ప్రధాని పదవి చేపట్టి, నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్నారు వేశారా? పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఓటు వేయాలి? అని విమర్శల వర్షం కురిపించారు. మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారని విమర్శించారు. ఇక్కడి బీజేపీ నేత సీటీ రవి కాదు లూటీ రవి అని ఎద్దేవా చేశారు. తనది మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని అన్నారు.

నగరంలో గ్యాంగ్‌ రేప్‌?

భర్త ఎదుట అఘాయిత్యం

బనశంకరి: బెంగళూరులో నడిబొడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్‌ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్‌, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమైపె అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మంగళూరుకు వందేభారత్‌ ట్రయల్‌ రన్‌

యశవంతపుర: బెంగళూరులోని యశవంతపుర– తీర నగరం మంగళూరు సెంట్రల్‌ల మధ్య వందేభారత్‌ రైలును ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. 16 బోగీలతో కూడిన వందేభారత్‌ రైలు ట్రయల్‌ శనివారం విజయవంతమైంది. యశవంతపుర రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరిన రైలును వివిధ ష్టేషన్ల గుండా ప్రయాణించి చూశారు. రైల్వే ఉన్నతాధికారులు ఈ రైలులో ప్రయాణించారు. సమస్యలు ఉంటే పరిష్కరించి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement