●మంత్రి అజయ్‌సింగ్
రాయచూరు రూరల్: జిల్లాలో బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారి వరకు చేస్తున్న పాదయాత్ర హాస్యాస్పదమని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరం వద్ద విలేకరులతో మాట్లాడారు. సర్కార్‌లో మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసినా పాదయాత్ర చేయడం హాస్యాస్పదమన్నారు. రెండు వారాల పాటు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కరువు, రైతులు, కస్తూరి రంగన్ నివేదికలపై చర్చ జరగకుండా అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగిలి కాలహరణం చేశారని ఆరోపించారు.


