కోలారు: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడిని భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మాలూరు తాలూకా చిక్కతిరుపతి గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని సొణ్ణేనహళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (36) హతుడు. సురేష్ భార్యతో వెంకటేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మానసికంగా కుంగిపోయిన సురేష్.. ఎలాగైనా వెంకటేష్‌ను హతమార్చాలని పక్కా ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో సురేష్ తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి వెంకటేష్‌కు పూటుగా మద్యం తాగించారు. అనంతరం వెంకటేష్‌ను గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని నీటి సంపులో పడేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకుపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


