రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. ఆదివారం రాత్రి జిల్లాధికారి కార్యాలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మునియప్పతో సంచాలకుడు మారెప్ప, రవీంద్రనాథ్ మాట్లాడారు. అశ్వినితో పాటు భూమానంద, రేణుక, రమే్‌ష్‌ల మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. నరసింహులు, శివ కుమార్, బేరి, హేమరాజ్‌లున్నారు.
ఉపాధ్యాయులు నిష్టగా పని చేయాలి
రాయచూరు రూరల్: సమాజంలో ఉపాధ్యాయులు నిష్ట, నిజాయితీతో పని చేయాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, విద్యా శాఖ, నగరసభ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ఉపాధ్యాయులు నిష్ట, ప్రామాణికత, దక్షతతో విధులు నిర్వహించి ఉన్నత విద్యను బోధించాలన్నారు. 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులిచ్చి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బోసురాజు, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, జయన్న, జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున, సుఖదేవ్, విద్యాశాఖాధికారులు ఈరణ్ణ, చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం పదాధికారులు చంద్రశేఖర్ రెడ్డి, యంకప్ప, మొయిన్ ఉల్ హక్, యంకప్ప మూర్తిలున్నారు.


