కోలారు: వహ్నికుల క్షత్రియ కుల బాంధవుల ఆరాధ్యదైవం ద్రౌపదమ్మ దేవి జయంత్యుత్సవాన్ని ప్రతి యేటా ప్రభుత్వం నుంచే ఆచరించాలని తిగళ సముదాయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎల్‌ఏ మంజునాథ్ మనవి చేశారు. మంగళవారం నగరంలోని ధర్మరాయస్వామి, ద్రౌపదమ్మ దేవి ఆలయంలో ద్రౌపతమ్మ దేవి జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అన్ని జయంతులను ఆచరిస్తోంది. అదేవిధంగా వహ్నికుల క్షత్రియ ఆరాధ్య దేవత శ్రీ ద్రౌపదమ్మ దేవి జయంతిని కూడా ఆచరించాలన్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధికి అనుకూల మయ్యేలా అధిక నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సముదాయ సంఘటితం అయితేనే ప్రభుత్వం నుంచి సౌకర్యాలను పొందవచ్చన్నారు. సముదాయ ప్రజలు తమ పిల్లలకు ఉత్తమ విద్యాభ్యాసం అందించాలన్నారు. ద్రౌపతాంబ దేవికి విశేష పూజలను నిర్వహించారు. రాష్ట్ర తిగళ క్షత్రియ మహాసభ అధ్యక్షుడు ఎం.వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మైక్ శంకర్, కోశాధికారి నరసాపుర శ్రీనివాస్ పాల్గొన్నారు.


