శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా సేవా విభాగం తొలి కార్యక్రమం సెప్టెంబర్ 5న విజయనగర జిల్లాలోని కూడ్లిగిలో ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ తెలిపారు. ఆ రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సమస్యలపై వినతిపత్రాలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రజల కోసం 2 క్యూలు ఉంటాయి, పరిష్కారం కాని లేదా అసంతృప్తికరంగా పరిష్కరించిన ఫిర్యాదుల కోసం ఓ క్యూ ఉంటుందని తెలిపారు. ముందే వినతిపత్రం ఇచ్చినా 21 రోజుల తరువాత కూడా పరిష్కారం కాని ఫిర్యాదులను ఈ క్యూలో స్వీకరిస్తారని చెప్పారు.
పలు మార్గాల్లో అవకాశం
ప్రజలు తమ దరఖాస్తులను, ఫిర్యాదులను గ్రామ వన్ కేంద్రాలలో ముందుగానే సమర్పించవచ్చు. సమావేశ వేదిక వద్ద గ్రామ్ వన్ కియోస్క్‌లను కూడా ఏర్పాటు చేసి, వాటికి కంప్యూటర్లు, ప్రింటర్లు , ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పిస్తారు. దీనివల్ల దరఖాస్తులను, ఫిర్యాదులను అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో అందజేయడానికి వీలుంటుంది. ప్రజలు తమ సమస్యలను 1902 హెల్ప్‌లైన్ ద్వారా లేదా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార వెబ్‌సైట్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చు. ప్రతి ఒక్కరి వినతిపత్రం, పరిష్కార వివరాలు, ఫోటోలు, వీడియోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.
5న ప్రజల సమస్యలపై వినతుల స్వీకారం
సీఎస్ శాలినీ రజనీష్


