ఆలయ భూములు పరిరక్షించండి | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూములు పరిరక్షించండి

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

బళ్లారి అర్బన్‌: రూపనగుడి హోబళిలో యెట్టిన బుడిహాళు గ్రామంలో కల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్‌–55లోని 17.01 ఎకరాల భూమిని పూజారి కుటుంబం రూ.48 లక్షలకు విక్రయించింది. దీనిపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 145 కింద చర్యలు తీసుకోవాలి’ అని న్యాయవాది రామన్న డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని ప్రతికా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిపై ఓఎస్‌ నంబర్‌ 233/2015 కింద కేసు ఉండగానే విక్రయం జరిగిందన్నారు. విచారణలో భూమి ఆలయానికి చెందినదని.. పూజారి లేదా ఆయన బంధువులు విక్రయించరాదని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ పూజారి కుటుంబ సభ్యులు భూమిని విక్రయించారని ఆరోపించారు. ఈ వివాదంపై గ్రామస్తులు, భక్తులు ఓఎస్‌ నంబర్‌ 348/ 2021 కింద కేసు దాఖలు చేశారన్నారు. వివాదాస్పద భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ప్రతివాదులను నిరోధించాలని కోరారు. సమావేశంలో కట్టె బసప్ప, మారెన్న, శ్రీదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement