● 9 నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర
సాక్షి, బళ్లారి: వాల్మీకి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం, మాజీ మంత్రి నాగేంద్రకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ పాదయాత్రకు సిద్ధమైంది. నేటి నుంచి (సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు) రాయచూరు జిల్లా లింగసూగూరు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుండటంతో రోడ్లన్నీ కషాయమయం చేశారు. 10 రోజుల పాటు రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లోని 9 నియోజకవర్గాల్లో 190 కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుంది. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, బళ్లారి నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితర నేతలతో పాటు, మూడు జిల్లాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు, కార్యకర్తలు, నేతలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.


