అన్ని మతాల సారాంశం ఒక్కటే | - | Sakshi
Sakshi News home page

అన్ని మతాల సారాంశం ఒక్కటే

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

సాక్షి, బళ్లారి: ‘ఇస్లాం ధర్మం గురించి ఎంతో అధ్యయనం చేశాను. ఇస్లాం ధర్మంలో కూడా గొప్ప సందేశం ఉంది’. అని మంత్రి బసవరాజు రాయరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొప్పళ నగరంలో జరిగిన ముస్లింల సామూహిక వివాహాల్లో పాల్గొని మాట్లాడారు. మతాల విషయంతో చిన్నది, పెద్దది అనే భావన ఉండకూడదని తెలిపారు. అన్ని మతాలు, ధర్మాల్లో ఉన్న సారంశం ఒక్కటే.. దేవుడు కూడా ఒక్కడే అని పేర్కొన్నారు. ఇస్లాం ధర్మం గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తనకు హజ్‌ యాత్రకు వెళ్లాలని ఉందని.. అయితే మతం అడ్డువస్తున్నందున ఏమి చేయలేకపోతున్నట్లు తెలిపారు. ఖురాన్‌ను ఇంకా పూర్తిగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఖురాన్‌ ముస్లింలకు మాత్రమే కాదు.. యావత్‌ ప్రపంచానికి సందేశం ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య హయాంలో ముస్లింల సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మంత్రి యతీంత్ర సిద్దరామయ్య మాట్లాడుతూ.. సృష్టికర్త ఒక్కరే అని.. ధర్మాలు, మతాల గురించి గొడవ పెట్టుకోకూడదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement