కరువుతో చెరువులు ఖాళీ | - | Sakshi
Sakshi News home page

కరువుతో చెరువులు ఖాళీ

Aug 25 2026 12:21 AM | Updated on Aug 25 2026 12:21 AM

అన్నయ్యకో రాఖీ

కోలారు: కోలారు జిల్లాను కరువు వెంటాడుతోంది. జిల్లా పాలు, పట్టు కేంద్రంగా అలరారుతోంటే, కరువు కాటేస్తోంది. దుర్భిక్షం ధాటికి రైతుల జీవనాడి అయిన చెరువులు ఎండిపోతున్నాయి. దీని వల్ల బోరుబావులు కూడా ఎండుతున్నాయి. భవిష్యత్తులో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కేసీ వ్యాలీ నీరు ప్రవహించే చెరువులు మినహాయించి మిగిలిన చెరువుల్లో నీరు గణనీయ ప్రమాణంలో తగ్గుతోంది. కోలారు జిల్లాలో మొత్తం 3,232 చిన్న, పెద్ద చెరువులు ఉన్నాయి. వీటిలో 995 చెరువులు ఎండిపోయాయి. 1885 చెరువుల్లో నీటి ప్రమాణం 50 శాతం కంటే తక్కువగా ఉంది. 23 చెరువులు మాత్రమే పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి. చిన్న నీటిపారుదల శాఖకు చెందిన 143 చెరువులకు గాను 6 చెరువుల్లో మాత్రమే పూర్తిగా నీరు నిండి ఉంది. 13 చెరువులు పూర్తిగా ఖాళీ అయ్యాయి. వానలు రాకుంటే వ్యవసాయం, పశుపోషణ ఎలా అని దిగులు వ్యాపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement