దగ్గర నుంచి కాల్చారు | - | Sakshi
Sakshi News home page

దగ్గర నుంచి కాల్చారు

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా కావేరి అభయారణ్యంలో ఆగస్టు 15న తెల్లవారుజామున అటవీ సిబ్బంది ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు స్థానికులు మరణించడం తెలిసిందే. మృతుల పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు పోలీసులకు అందగా వివరాలను విడుదల చేశారు. మృతుడు అంథోనిస్వామి, పీటర్‌, కుమార్‌ మృతదేహాల్లో ఎద, తొడ, కడుపు భాగంలో బుల్లెట్‌ గాయాలు తగిలినట్లు తెలిపారు. అలాగే ఫోరెన్సిక్‌ నివేదికలో మరో సీరియస్‌ విషయం కూడా తేలింది. మృతుడు ఆంథోనిస్వామి, పీటర్‌ లోదుస్తుల్లో గన్‌పౌడర్‌ అంశాలు గుర్తించినట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ కాల్పులు దగ్గరనుంచి జరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మృతుల బంధువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

కొనసాగుతున్న దర్యాప్తులు

మరోవైపు పోలీసుల దర్యాప్తు సాగుతోంది. 12 మంది అటవీ శాఖ సిబ్బందిని విచారించారు. ఏకై క ప్రత్యక్ష సాక్షి, ఆరోజు మృతుల వెంట ఉన్న మహిమదాస్‌ వాంగ్మూలాన్ని సేకరించారు. పైగా వేట కేసులో అతడు నాలుగో నిందితుడు కూడా. సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో మెజస్టీరియల్‌ విచారణ కొనసాగుతోంది. ఈ నివేదికతో కేసు మలుపు తిరిగే అవకాశముంది.

హనూరు అటవీ కాల్పుల కేసులో

పోస్టుమార్టం నివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement