1.07 కోట్ల ఓట్లు పోయినట్టే? | - | Sakshi
Sakshi News home page

1.07 కోట్ల ఓట్లు పోయినట్టే?

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సమీక్ష (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ తరువాత సుమారు 1.07 కోట్ల మందికిపైగా ఓట్లు ప్రమాదంలో పడ్డాయి. వారందరూ వివిధ కేటగిరీల్లో అనర్హత అంశాల్లో ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. దీంతో భారీగా ఓట్లు రద్దయితే ఎలా అని పార్టీల్లో ఆందోళన నెలకొంది.

తొలగించిన ఓట్లు ఇలా...

● ముసాయిదా ఓటరు లిస్టును ఎన్నికల సంఘం విడుదల చేసింది. సోమవారం బెంగళూరులో సీఈఓ అన్బుకుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

● ఎస్‌ఐఆర్‌కు 15,17,042 మంది గైర్హాజరయ్యారని, 65,45,679 మంది ఓటర్లు శాశ్వతంగా చిరునామా మారిపోయారని తెలిపారు.

● 16,59,864 మంది ఓటర్లు మరణించారన్నారు. 7,09,870 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉన్నారన్నారు. 3,83,884 మంది ఇతర కేటగిరీలలో సమస్య కలిగి ఉన్నారు.

●43,81,335 మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. వారి విచారణ అక్టోబర్‌ 22వ తేదీ లోపు ముగుస్తుందన్నారు.

బెంగళూరుకు షాక్‌

బెంగళూరు సిటీలో అధికంగా మ్యాపింగ్‌ సమస్య ఎదురైందని, సెప్టెంబరు 24లోపు ఫారం–6 భర్తీ చేసి ఇస్తే ఓటర్ల లిస్టులో పేరు ఉంటుందని సీఈఓ తెలిపారు. బెంగళూరులో కోటి మంది ఓటర్లు ఉంటే సగం మంది ఓటర్లను తొలగించినట్లు తెలుస్తోంది.

సర్‌కు ముందు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తరువాత 1,07,96,339 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. విచారణ తరువాత వారిలో ఎంతమందిని తిరిగి చేర్చుకుంటారన్నది వేచిచూడాలి. కాగా, కోటి ఓట్లు పోతే తమ పరిస్థితి ఏమిటి, మెజారిటీలు ఏమవుతాయని పార్టీల్లో కలవరం మొదలైంది.

పలు కారణాలతో పేర్ల తొలగింపు

ఈసీ ముసాయిదా ఓటరు జాబితా విడుదల

43 లక్షల మందికి నోటీసులు

సీఈఓ అన్బుకుమార్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement