బళ్లారి అర్బన్: జిల్లాలోని సిరుగుప్ప తాలూకా తెక్కలకోటె, బలకుంది, ఉప్పార హొసళ్లి, అరళిగనూరు, పప్పునహాళు, బాగేవాడి తదితర గ్రామాల పరిధిలో ఉప కాలువ నుంచి అక్రమంగా నీటిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని సోమవారం నీటి వినియోగదారుల సహకార సంఘం అధ్యక్షుడు ఎంఎస్.బందేనవాజ్, ప్రధాన కార్యదర్శి బి.చిదానందప్ప, ఉపాధ్యక్షుడు మరినాగప్ప, ఆయా గ్రామాల రైతులు జిల్లాధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. వరి నాట్లు సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో ఆయా గ్రామాల రైతులకు సాగునీరు సక్రమంగా అందించాలని కోరారు. కొందరు అక్రమంగా నీటిని తరలించడంతో దిగువ ప్రాంతాల రైతులకు నీరు అందడం లేదన్నారు. అక్రమంగా పంపుసెట్లతో నీటిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాధికారికి రైతన్నల వినతి


