రాయచూరు రూరల్: జిల్లాలోని వివిధ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర హాస్టల్ భోజన కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం గ్రామీణ శాసన సభ్యుడి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడారు. సాంఘీక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని రాష్ట్ర సర్కార్ పర్మినెంట్ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం నిష్పత్తిలో వేతనాలు పెంచేలా అసెంబ్లీలో గళమెత్తాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌కు వినతిపత్రం సమర్పించారు.


