జాతీయ రహదారిపై నిరసన | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై నిరసన

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

హొసపేటె: జాతీయ రహదారి–50పై అశాసీ్త్రయ, అజాగ్రత్తగా పనులు చేపట్టడంతో ఆదివారం గ్రామస్తులు నిరసన చేపట్టారు. సిద్ధాపుర గ్రామానికి చెందిన యువకుడు నగేష్‌.. అర్ధరాత్రి బైక్‌పై వస్తూ అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో గాయపడటంతో ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదృష్టవశాత్తూ ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రోడ్డుపైకి భారీగా తరలివచ్చిన సిద్దాపుర గ్రామస్తులు నిరసన తెలిపారు. ఆగ్రహంతో బైక్‌కు నిప్పు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.

గ్రానైట్‌ లారీ సీజ్‌

క్రిష్ణగిరి: రాజస్థాన్‌ నుంచి తమిళనాడుకు అనుమతి లేక గ్రానైట్‌ రాళ్లు తీసుకొస్తున్న కంటైనర్‌లారీని ఖనిజ సంపద శాఖాధికార్లు సీజ్‌ చేశారు. శనివారం రాత్రి క్రిష్ణగిరి – కుప్పం రోడ్డులోని వరటనపల్లి వద్ద వాహన తనిఖీలు చేశారు. కంటైనర్‌ లారీని అడ్డగించి పరిశీలించగా రాజస్థాన్‌ నుండి తమిళనాడుకు అనుమతి లేకుండా విలువైన గ్రానైట్‌ రాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. లారీని స్వాధీనపరుచుకొని కందికుప్పం పోలీసులకు అప్పగించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement