బళ్లారి టౌన్: దళితులను బీజేపీ చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఢిల్లీలోని రామలీల మైదానంలో ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే సార్వజనిక సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్తలు పాల్గొని ఆ స్థలాన్ని శుద్దీకరణ చేయడాన్ని తప్పుపట్టారు. సోమవారం స్థానిక జిల్లాధికారి కార్యాలయం ఎదుట ఉన్న మహత్మా గాంధీ విగ్రహం ఎదుట జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దళిత నాయకుడు ఆధ్వర్యంలో నిర్వహించిన స్థలాన్ని శుద్ధి చేయడం దారుణమన్నారు. బీజేపీకి దళితులంటే చిన్న చూపు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, మేయర్ గాదెప్ప, లీడ్కర్ అధ్యక్షుడు ముండరిగి నాగరాజ్, పార్టీ నేతలు బోయపాటి విష్ణు, ఎరుకుల స్వామి, రవికుమార్, సరుగు నాగరాజ్, శ్రీకాంత్, అలివేలు సురేష్, మానయ్య, ఎల్.మారెణ్ణ. యంతీంద్ర, చిదానందప్ప యాదవ్, బీఎం పాటిల్, మల్లేశ్వరి, గౌసియా తదితర నేతలు పాల్గొన్నారు.


