కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తగదు | - | Sakshi
Sakshi News home page

కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తగదు

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

రాయచూరు రూరల్‌: లోక్‌సభలో ప్రతిపక్షాలకు విలువ లేదని, కేంద్ర పాలకులు ఏకపక్ష నిర్ణయాలతో తీర్మానాలు చేస్తున్నారని నగరంలో పలు కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సోమవారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో కార్మిక నేతలు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, విద్యుత్‌ చట్టం ఇతర మూడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రైతు, కార్మిక, దళిత, మహిళా, విద్యార్థి, యువత వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జిల్లాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తుండగా ఆందోళనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించి తరలించారు. ఆందోళనలో శరణ బసవ, వీరేష్‌, పద్మ, కరియప్ప, వరలక్ష్మిలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement