రెడ్డి సంఘం కార్యవర్గం ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రెడ్డి సంఘం కార్యవర్గం ఎంపిక

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

రాయచూరు రూరల్‌: తాలూకా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా సుధాకర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. సోమవారం నగరంలోని రెడ్డి సంఘం కార్యాలయంలో జరిగిన పదాధికారుల ఎన్నికల్లో సీనియర్‌ నాయకుడు రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధ్యక్షుడిగా తురకనడోణ సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రాఘవరెడ్డి, కార్యాధ్యక్షుడిగా అచ్యుతరెడ్డి, గౌరవాధ్యక్షుడిగా వేంకటేశ్వరరెడ్డి, కార్యదర్శిగా శేఖర్‌రెడ్డి, కోశాధికారిగా నరసింహారెడ్డిలను ఎన్నుకున్నారు.

మరణంలోనూ వీడని బంధం

సాక్షి,బళ్లారి: భార్య మృతితో విషాదంలో మునిగిపోయిన భర్త కూడా కొద్ది సేపటికే మృతి చెందారు, మరణంలోనూ వీడని బంధం అని నిరూపించారు. దావణగెరె జిల్లా హదడి గ్రామంలో మల్లప్ప (81) ,సిద్దమ్మ(75)ది 50 ఏళ్ల దాంపత్య జీవనం. సిద్దమ్మ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందగా, సోమవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, భర్త మల్లప్ప కూడా మరణించాడు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

యువత స్వయం ఉపాధి సాధించాలి

రాయచూరు రూరల్‌: నగర, పట్టణ ప్రాంతంలోని యువత స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని విధాన పరిషత్‌ సభ్యుడు బసనగౌడ బాదర్లి సూచించారు. సోమవారం సింధనూరులోని తన కార్యాలయం వద్ద యువతకు నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా వీరశైవ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో స్వావలంబి సారథి పథకం కింద మంజూరైన కారును పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడాలన్నారు.

పుట్టిన 5 రోజులకే

ఆధార్‌ నమోదు

చిన్నారికి ప్రపంచ రికార్డు గౌరవం.!

హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా శ్రీరామనగరకు చెందిన చిన్నారి అంచురి రాయంక త్రినయని పుట్టిన కేవలం ఐదు రోజులకే ఆధార్‌ కార్డు నమోదు చేయించుకున్న అతి పిన్న వయసు చిన్నారిగా నిలిచింది. ఈ ఘనతను ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించి ప్రపంచ రికార్డు పతకం, సర్టిఫికెట్‌తో సత్కరించింది. శ్రీరామనగర నివాసులు డాక్టర్‌ ఏ.పవన్‌కుమార్‌, డాక్టర్‌ వరలక్ష్మీ పాల్‌ దంపతుల కుమార్తె అంచురి రాయంక త్రినయని 2026 మే 1న గంగావతిలోని వివేకానంద ఆస్పత్రిలో జన్మించింది. బిడ్డ పుట్టిన తర్వాత ఐదవ రోజున అంటే మే 6న తల్లిదండ్రులు బిడ్డ పేరు మీద ఆధార్‌, జనన నమోదు పత్రాలను నమోదు చేయించారు.

ప్రతిభ తార్కాణం కావాలి

రాయచూరు రూరల్‌ : విద్యార్థుల ప్రతిభకు ప్రదర్శనలకు తార్కాణం కావాలని ఎంపీ కుమార నాయక్‌ పేర్కొన్నారు. నగరంలోని పండిత సిద్ద రామ జంబల దిన్ని రంగమందిరంలో మహర్షి వాల్మీకి సమాజం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. సమాజ సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. స్వార్థం వీడి నిస్వార్థంతో పని చేయాలన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉత్తమ విద్యకు అవకాశం ఉంటుందన్నారు. స్వశక్తితో ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు. స్వామీజీలు, శాసన సభ్యులు శివరాజ్‌ పాటిల్‌, బసనగౌడ దద్దల్‌, ఎమ్మెల్సీ బోసురాజ్‌, ప్రముఖులు రవి, పాటిల్‌, రవీంద్ర, వెంకటేష్‌ నాయక్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement