రాయచూరు రూరల్: కరువు సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని కలబుర్గి జిల్లా ఇంచార్జి, హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాల మేరకు కల్యాణ కర్ణాటకలో ఇంచార్జి మంత్రులు కరవు అధ్యయనం చేపట్టారు. ఇటీవల యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్ తంగడిగి ఆయా జిల్లాల్లో పర్యటించగా సోమవారం విజయపుర జిల్లాలో ఇంచార్జి మంత్రి ఎంబీ పాటిల్, కలబుర్గి జిల్లాలో ఇంచార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గే పర్యటించారు. రైతులు తమ భూముల్లో వేసుకున్న కంది, పత్తి, చెరకు, జొన్న తదితర పంటలను పరిశీలించారు. కలబుర్గి తాలూకా అవర్దలో, విజయపుర జిల్లా బబలేశ్వర, సారవడిగిలో పంటలను చూసి కరువు పరిస్థితులపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదికను అందిస్తామన్నారు.


