కోలారు: ఆదాయ పన్నుల శాఖ నుంచి వచ్చిన నోటీసులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నోటీసులకు సంబంధించి అవసరమైన దాఖలాలు సమర్పించి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆదాయ పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ మీరా పండిత్ తెలిపారు. ఆదివారం తాలూకాలోని అజ్జప్పనహళ్లి గేట్ వద్ద ఉన్న ఎస్‌కె ఇంటర్నేషనల్ ఇన్ సభాంగణంలో జాతీయ పన్నుల సమ్మేళనం, పన్ను సలహాదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నోటీసు అనేది నిఖరమైన సమాచారం పొందడానికి అవసరమైన సాధనం మాత్రమే అన్నారు. నోటీసులకు సమాధానం, అవసరమైన దాఖలాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపారు. ప్రతి విషయానికి కార్యాలయానికి వెళ్లి దాఖలాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా పన్నుల సలహాదారుల సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్, ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షుడు ఉమారెడ్డి, జిల్లా సంఘం పదాధికారులు పాల్గొన్నారు.


