బనశంకరి: నిత్యం ఇల్లు, ఆఫీసు పనుల్లో నిమగ్నమై ఉండే మహిళలు ఫ్లవర్ షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉద్యాననగరి లాల్‌బాగ్‌లో ఈ నెల 6వ తేదీన ఆరంభమైన ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. అదే మాదిరిగా లాల్‌బాగ్‌లోని ఆడిటోరియంలో పలు ప్రదర్శనలు జరుగుతున్నాయి. పండ్ల, కూరగాయలను అందంగా తీర్చిదిద్దడం, జపాన్ శైలిలో పుష్ప అలంకారం (ఇకెబనా), పూలతో ముగ్గులు, పొట్టి చెట్ల ప్రదర్శన పోటీలను శనివారం ప్రారంభించారు. కళింగర, గుమ్మడి తదితర పండ్లపై మహనీయులు ఆకారాలను చెక్కారు. మహిళలు పూలతో రంగవల్లులు రూపొందించారు. కాగా, మధ్యాహ్నం నుంచి నుంచి ఓ మోస్తరు వర్షం ప్రారంభం కావడంతో పుష్ప ప్రదర్శనలో కొంత రద్దీ తగ్గింది.
లాల్‌బాగ్‌లో పోటీలు


