రాయచూరు రూరల్ : ఆలయంలో చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ నింబర్గి వెల్లడించారు. శుక్రవారం ముద్దేబిహాళ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముద్దేబిహాళ్ తాలూకా బసరకోడు గ్రామంలోని బసవేశ్వర ఆలయంలో బుధవారం రాత్రి ఆలయంలోకి చొరబడి 32 కేజీల వెండి ఆభరణాలను దుండగులు దొంగలించారని తెలిపారు. ఈ విషయంపై ముద్దేబిహాళ్ పోలీసు అధికారులు చంద్రశేఖర్, మహ్మద్ ఫసియుద్దీన్, తిప్పారెడ్డిల సహకారంతో గుజరాత్‌కు చెందిన సంతోష్, కుమార్, ఇంద్రజిత్, కమ్మార్‌లను అరెస్ట్ చేశారన్నారు. నిందితుల నుంచి రూ.52 లక్షల విలువ చేసే 32 కేజీల వెండి వస్తువులను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు.


