రాయచూరు రూరల్: నాసిరకంగా జరుగుతున్న మాన్వి–రాయచూరు జాతీయ రహదారి నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం మాన్విలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. పనులు పరిశీలించేందుకు వచ్చిన బెంగళూరుకు చెందిన కేఆర్‌డీసీఎల్ ఇంజినీర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రధాన రహదారి నిర్మాణాల్లో ఉన్న లోపాలను సరిదిద్దకుండా అవైజ్ఞానికంగా పనులు చేపట్టడం తగదని విమర్శించారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రహదారిని వెడల్పు చేసి, మురుగు కాలువలను కుదించడం వల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.


