వైభవంగా ఆరాధనోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆరాధనోత్సవం

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

చిక్కబళ్లాపురం: దక్షిణకాశీ పంచనదుల మహా పుణ్య క్షేత్రం పాపాగ్ని మఠం చారిటబల్‌ ట్రస్ట్‌ విశ్వకర్మ సముదాయం నుంచి శరభ యోగీంద్ర స్వాముల 308వ ఆరాధనోత్సవం, వీరబ్రహ్మయ్య స్వామి రథోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి గణపతి హోమం, పుణ్యాహ, దశ శాంతి, రుద్రాభిషేక, కలసారాధన, మహా మంత్ర హోమం, కలసోత్సవం, లింగప్రతిష్టాపన, శరభ యోగీంద్రస్వామి, అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వనాథస్వామి వారికి పంచామృత అభిషేకం, వివిధ పూజా కై ంకర్యాలు నెరవేరాయి. చిక్కబళ్లాపురం జిల్లా చుట్టు పక్కల నుంచి వచ్చిన అసంఖ్యాక భక్తాదులు పూజా కై ంకర్యంలో పాల్గొన్నారు. తరువాత వీరబ్రహ్మయ్య రథోత్సవానికి విధి విధానాలతో శ్రీకారం చుట్టారు. వందలాది మంది భక్తాదులు రథానికి పూజలు నెరవేర్చారు. తరువాత అందరూ ఊరేగింపులో పాల్గొన్నారు. ట్రస్ట్‌ అధ్యక్షుడు హెంజారాచారి, సభ్యులు నంజుండాచారి, సుబ్రహ్మణ్యాచారి, మంజునాథ్‌, కృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement